అంతా బానే ఉంది కానీ ఆ ఒక్క విషయంలోనే తేడా కొడుతుంది *Cricket | Telugu OneIndia

2022-09-13 1

Everything is Ok In Teamindia T20 World cup Squad, Except dilemma at no.5 Batter | ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 కోసం సెలెక్షన్ కమిటీ బలమైన టీంను ఎంపిక చేసిందని, భారత జట్టులో 5వ స్థానానికి రిషబ్ పంత్, దీపక్ హుడా మధ్య పోటీ జరుగుతుందని వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రాబిన్ ఉతప్ప చెప్పాడు. సెప్టెంబర్ 13న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ 15మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన తర్వాత ఉతప్ప ఈ కామెంట్లు చేశాడు. 'యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అశ్విన్ అందరూ తెలివిగా బౌలింగ్ చేసేవారే. సరైన టైంలో వికెట్లు తీయగలరు. వారి ఉద్దేశం ఎప్పుడూ కూడా వికెట్లను పడగొట్టాలనే ఉంటుంది. ఇక బ్యాటింగ్లో మొదటి నాలుగు ఆప్షన్లు స్ట్రాంగ్‌గా కన్పిస్తున్నాయి. రాహుల్, రోహిత్, కోహ్లీ సూర్య గురించి చెప్పాల్సిన పనిలేదు. దిగువ మిడిల్ ఆర్డర్ కూడా పటిష్టంగానే ఉంది.

#Uthappa
#T20WorldCup2022
#IndianSquad
#RohitSharma
#BCCI
#TeamIndia
#Cricket